Hyderabad: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022పై అవగాహన సదస్సు
Hyderabad: హైదరాబాద్ శిల్పకళా వేదికలో రెండురోజుల పాటు సదస్సు
Hyderabad: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన ఎడ్యుకేషన్ పాలసీ - NEP 2022 ద్వారా విద్యారంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీనిపై ఇంకా చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడలేదు. విద్యారంగంలోని మార్పులను అర్థం చేసుకోవడం ఎలా పిల్లలకు ఏవిధంగా అప్లయి చేయాలి. పేరెంట్స్ తయారీ ఎలా ఉండాలి. విద్యాసంస్థలు ఏవిధంగా సంసిద్ధం కావాల్సి ఉంది.
అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు ది హన్స్ ఇండియా సంకల్పించింది. దీనికోసం హైదరాబాద్ లో వినూత్నంగా విద్యాసదస్సు ఏర్పాటు చేసింది. శిల్పకళా వేదికలో ఇవాళ, రేపు ఈ సదస్సు జరుగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 అమలులో భాగంగా ఇప్పుడున్న 10 + 2 స్థానంలో 5 + 3 + 3 + 4 పద్ధతిలో విద్యాబోధన కొనసాగుతుంది.