Jani Master: జానీ మాస్టర్ కు షాక్.. జాతీయ అవార్డు తాత్కాలిక నిలిపివేత

Jani Master:అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు మరో షాక్ ఎదురయ్యింది. ఈ కేసు కంటే ముందే తాను నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2022లో బెస్ట్ కొరియోగ్రాఫర్ కు ఎంపికయ్యారు. ఈ అవార్డును రద్దు చేస్తూ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కమిటీ ప్రకటనను విడుదల చేసింది.

Update: 2024-10-06 01:46 GMT

 లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కు షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు అవ్వడంతో జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. 2022ఏడాదికి గాను తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు సినిమాకు బెస్ట్ కొరియో గ్రాఫర్ గా జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వరించింది.

అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ ఉంది. అయితే రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరారు. రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కోర్టు మధ్యంత బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పును ఇచ్చింది. దీంతో అవార్డు ఫంక్షన్ కు హాజరయ్యేందుకు జానీ మాస్టర్ రెడీ అవుతున్నతరుణంలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News