Narsampet: ఇవాళ నర్సంపేట బంద్
Narsampet: రాఖేష్ మృతికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన టీఆర్‌ఎస్
Narsampet: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మృతి చెందాడు. రాకేష్ మృతి పట్ల ఇవాళ నర్సంపేట బంద్‌కు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ బంద్‌కు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాకేశ్ మృతదేహం వరంగల్ MGM హాస్పిటల్‌లో ఉంది. MGM నుంచి ధర్మారం వరకు రాకేశ్ మృతదేహంతో భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి టీఆర్‌ఎస్ శ్రేణులు.
సాయంత్రం నాలుగు గంటలకు దబీర్‌పేటలో రాకేశ్ అంత్యక్రియలు జరగనున్నాయి. నర్సంపేట బంద్‌లో భాగంగా MGMకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు రాకేష్ స్వగ్రామం ఖానాపురం మండంలోని దబీర్‌పేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాకేష్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రాకేశ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున భారీ పరిహారాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్. మోడీ సర్కార్ అనుసరిస్తోన్న తప్పుడు, దుర్మార్గ విధానాలకు రాకేశ్ బలికావడం తనను కలిచివేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్ కుటుంబానికి 25 లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
సైన్యంలోకి వెళ్లాలని రాకేశ్ వాళ్ల అన్న కోరిక నెరవేరలేదు. రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరగడంతో ఆ కల అలాగే ఉండిపోయింది. ఆ కోరికను చెల్లెలు, తమ్ముడి ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. సైనికుల గాథలు చెప్పి వారిలో స్ఫూర్తి రగిలించాడు. సోదరి ఇప్పటికే BSF జవాన్ కాగా, తమ్ముడు రాకేశ్ కూడా ఆ దిశగా ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. దురదృష్టవశాత్తు 'అగ్నిపథ్' ఆందోళనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్ మృతిచెందాడు.