Narendra Modi: తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గద్దె దించాలని చూస్తున్నారు
Narendra Modi: మహబూబాబాద్‌లో మోడీ ఎన్నికల ప్రచారం తెలంగాణలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మోడీ ధీమా
Narendra Modi: తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గద్దె దించాలని చూస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాశనం చేశాయని ప్రధాని ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ.. తెలంగాణలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అంటే సంస్కృతీ, సంప్రదాయాలు, సాంకేతికతకు పెట్టింది పేరు. కానీ కేసీఆర్ ఈ నేలను మూఢనమ్మకానికి మారుపేరుగా మార్చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ కుంభకోణాలపై బీజేపీ సర్కార్ వచ్చాక చర్యలు తీసుకుంటుందన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని, బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని మోడీ తెలిపారు.