హైదరాబాద్ నుండి అమెరికాకు డ్రగ్స్.. మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు...

Hyderabad - Drugs Rocket: క్రిప్టో కరెన్సీ ద్వారా అమెరికా నుంచి చెల్లింపులు...

Update: 2022-05-08 07:14 GMT

హైదరాబాద్ నుండి అమెరికాకు డ్రగ్స్.. మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు...

Hyderabad - Drugs Rocket: డ్రగ్ రాకెట్ కింగ్ పిన్‌ను NCB అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుండి అమెరికాకు డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు NCB అధికారులు. దోమలగూడ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ పేరుతో డ్రగ్ రాకెట్ నిర్వహిస్తున్న ఆశిష్ అనే డ్రగ్ పెడ్లర్ దందాను NCB బట్టబయలు చేసింది. ఆన్‌లైన్‌లో ఫార్మా మందులతోపాటు, డ్రగ్స్ సప్లై చేయడం అలవాటుగా చేసుకొంది.

జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో కంపెనీ నడిపిస్తున్న ముఠాను... పక్కా సమాచారంతో NCB అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 3 కోట్ల 71 లక్షల నగదుతోపాటు, లా‌ప్‌టాప్‌లు, మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కష్టమర్లతో వ్యాపారం ఎలా చేస్తున్నారన్న ఆధారాలను అధికారులు సేకరించారు. ఈమెయిల్స్ , VOIP ద్వారా కస్టమర్ల నుండి ఆర్డర్లను అశిష్ అండ్ కో సేకరిస్తున్నట్టు గుర్తించారు.

హైదరాబాద్ నుండి విదేశాలకు భారీగా డ్రగ్స్ సప్లై జరుగుతోందని ఫిర్యాదులతో NCB రంగంలోకి దిగింది. గడిచిన రెండేళ్లలో అమెరికాకు వెయ్యికి పైగా డ్రగ్స్ ఆర్డర్లుతో కోట్లు గడించారు నిందితులు. ఎలాంటి అనుమనాలు రాకుండా ఉండేలా చెల్లింపులను క్రిప్టో కరెన్సీ ద్వారా అందుకున్నట్టు అధికారులు తేల్చారు.  

Tags:    

Similar News