Corona: టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు కరోనా పాజిటివ్‌

Corona: సభకు కరోనా బాధితులు వచ్చినట్లు అనుమానం

Update: 2021-04-20 01:34 GMT

నోముల భగత్ & సీఎం కెసిఆర్ (ఫైల్ ఫోటో)

Corona: సాగర్‌లో టీఆర్ఎస్‌ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కరోనా వైరస్‌ విజృంభణకు కేంద్రంగా నిలిచింది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆపార్టీ అభ్యర్థి నోముల భగత్‌తోపాటు అక్కడి కీలక టీఆర్ఎస్‌ నేతలకు కరోనా సోకింది. దీంతోపాటు ఆసభకు హాజరైన వారిలో చాలామందికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్‌కు కరోనా సోకింది. యాంటీజెన్‌ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలియజేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో ప్రత్యేక వైద్యబృందం పరిశీలనలో ఉన్నారన్న ఆయన.. ముఖ్యమంత్రికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. అటు సీఎం ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. సీఎంకు పాజిటివ్‌ రావడంతో కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌, కుమార్తె కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఇక సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకోవాలంటూ పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈనెల 17న ఉపఎన్నిక ఉండడంతో ఈసారి గెలుపు కోసం టీఆర్ఎస్‌ తీవ్రంగా శ్రమించింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన హాలియాలో బహిరంగ సభ నిర్వహించారు. ఆసభ వలనే సీఎంతోపాటు ఆపార్టీ అభ్యర్థికి ఇతర ముఖ్య నాయకులకు కరోనా సోకిందని సమాచారం. అటు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్‌తోపాటు అతడి కుటుంబసభ్యులకు కూడా పాజిటివ్‌ తేలింది. సభకు వచ్చిన వారిలో కరోనా బాధితులు ఉండడంతోనే అందరికీ వ్యాపించిందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. సాగర్‌లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలకూ కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అంతేకాదు రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా కూడా కరోనా తీవ్రంగా విజృంభించిందని సమాచారం. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు గుమికూడడం, ప్రజలను కలవడం కరోనా నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలతో సాగర్‌ నియోజకవర్గంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మొత్తానికి మాస్క్‌లు ధరించినా భౌతిక దూరం పాటించకపోవడం వైరస్‌ వ్యాప్తి్కి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Tags:    

Similar News