తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావిడి

* మార్చిలో నాగార్జునసాగర్‌ ఉపఎన్నికతో పాటు,.. * పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే ఛాన్స్‌

Update: 2021-02-05 11:46 GMT

Representational Image

తెలంగాణలో మరోసారి ఎన్నికల హడావిడి ప్రారంభంకానుంది. దుబ్బాక, జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల అనంతరం కొద్దిగా విరామం తీసుకున్న రాజకీయ పార్టీలు మళ్ళీ ప్రచారాల హోరు పెంచనున్నాయి. రెండు జాతీయ పార్టీల ఇన్‌ఛార్జ్‌లు తెలంగాణలో పర్యటనకు వస్తుండడంతో పాలిటిక్స్‌ మళ్ళీ హీటెక్కనున్నాయి.

మార్చి మొదటివారంలో నాగార్జునసాగర్‌ ఉపఎన్నికతో పాటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే ఛాన్స్‌ ఉండడంతో అన్ని పార్టీలు రాష్ట్రంలో రాజకీయ హడావిడి పెంచడానికి సిద్ధమవుతున్నాయి. సాగర్‌ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి రెండు పార్టీలు. ఈ ఉపఎన్నికలో కూడా గెలుపొంది రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ చూస్తుంట సాగర్‌లో నైనా గెలిచి పరువు నెలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ ఉవ్విల్లూరుతోంది.

రాష్ట్రంలో జరిగే ఎన్నికలపై రెండు జాతీయ పార్టీలు దృష్టిపెట్టాయి. ఇప్పటికే సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికలపై వ్యూహం సిద్ధం చేసుకుంది కమలం పార్టీ. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతోంది. వచ్చేవారం తెలంగాణకు బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ వస్తుండడంతో అప్పటిలోపు పార్టీ ప్రచారానికి ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ప్రత్యేక దృష్టి సారించింది కమలం పార్టీ.

మరోవైపు రెండ్రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాగూర్. ఈ నెల 6న ఖమ్మంలో పర్యటించి అక్కడ మున్సిపల్ ఎన్నికల వ్యూహరచనపై చర్చించనున్నారు. 7న మిర్యాలగూడలో పర్యటించి, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూ హంపై పార్టీ ముఖ్య నేతలతో మాణికం ఠాగూర్‌ చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి దూరమైన క్యాడర్‌ను మళ్ళీ అక్కున చేర్చుకోవడానికి హస్తం పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి సాగర్‌ ఉపఎన్నికతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికలను రెండు జాతీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇందుకోసం ఢిల్లీ నుంచి నేతలు రాష్ట్రానికి దిగి రానున్నారు. మరి ఎన్నకల్లో ఏ పార్టీ వ్యూహం ఫలిస్తుందో వేచి చూడాలి.‎

Tags:    

Similar News