Minister KTR: మా అమ్మ నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు
KTR: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో జరిగిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
KTR: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో జరిగిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాంక్లేవ్‌కు మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తల్లి తనను డాక్టర్గా చూడాలనుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారని.. తమ తల్లి కూడా అలానే కోరుకున్నారని చెప్పారు. వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనదని.. వైద్యవృత్తిలో మహిళలు రాణించడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మహిళల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించారు. వైద్యులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అన్నిరంగాలకు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు. తెలంగాణ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు.