మునుగోడు టీఆర్ఎస్‌లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..

Munugode Politics: మునుగోడు టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ రాజుకుంది.

Update: 2022-08-12 16:00 GMT

మునుగోడు టీఆర్ఎస్‌లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..

Munugode Politics: మునుగోడు టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగ రాజుకుంది. మునుగోడు పరిధిలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్‌లో రహస్యంగా సమావేశమై మంతనాలు జరిపారు. ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వరాదని వారంతా తీర్మానాన్ని ఆమోదించారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే.. తాము పార్టీ విజయం కోసం పని చేసేది లేదని.. కూడా వారు తేల్చి చెప్పారు. దీంతో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి. ఈనెల 20న మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభ కోసం మంత్రి జగదీష్ రెడ్డి నారాయణపురం, చౌటుప్పల్, మునుగోడు మండల్లాలో పలు స్థలాలను పరిశీలించారు. టీఆర్ఎస్‌ గెలుపుతోనే మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి తన సొంత అభివృద్ధి కోసమే బీజేపీకి అమ్ముడుపోయి రాజీనామా చేశారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా రానివ్వమని, తన సొంత వ్యాపారాల కోసం మునుగోడు ప్రజలకు రాజగోపాల్ రెడ్డి చేసిన మోసాన్ని, బీజేపీ భoడారాన్ని మునుగోడు సభ ద్వారా ప్రజల్లో బయటపెడతామన్నారు. త‌మ‌కు పోటీయే లేదని, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్, బీజేపీలకు ఓటమి తథ్యమన్నారు.

Tags:    

Similar News