మంచిర్యాల విద్యుత్ అధికారులపై టీఆర్ఎస్ కౌన్సిలర్ల దౌర్జన్యం
Mancherial: మంచిర్యాలలో జిల్లా విద్యుత్ అధికారులు, చెన్నూరు టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ రేగింది.
Mancherial: మంచిర్యాలలో జిల్లా విద్యుత్ అధికారులు, చెన్నూరు టీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ రేగింది. పట్టణాభివృద్ధిలో భాగంగా ఫోర్ లైన్ రోడ్డు పొడిగించాలని నిర్ణయించారు. చిరు వ్యాపారులను మున్సిపాల్టీ అధికారులు తొలగించారు. చిరువ్యాపారులకు అదే స్థలంలో దుకాణాలు కట్టి ఇస్తామని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ హామీ ఇచ్చారు. అయితే విద్యుత్ సబ్ స్టేషన్ కు సంబందించిన భూమిలో మున్సిపల్ అదికారులు, కౌన్సిలర్లు ముగ్గుపోయడంతో వివాదం మొదలయ్యింది.
సబ్ స్టేషన్ భూమిలో దుకాణాల ఏర్పాటుపై వివరాలు అడిగితే టీఆర్ఎస్ కౌన్సిలర్లు దాడి చేశారని విద్యుత్ అధికారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ కార్మికులపై దాడిని నిరసిస్తూ విద్యుత్ అధికారులు, కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. తమపై దాడి చేసిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు కదలబోమని భీష్మించుకు కుర్చున్నారు. కౌన్సిలర్ల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.