TS Lock Down: లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదంటోన్న ఎంపీ ఓవైసీ
TS Lock Down: కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
TS Lock Down: కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. లాక్ డౌన్‌తో అనేక మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనాతో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు.
దీంతో కేవలం నాలుగు గంటలు మాత్రమే మినహాయింపు ఇస్తే నిరు పేదలు ఎలా బతుకుతారని ఓవైసీ ప్రశ్నించారు. లాక్ డౌన్ విధించకుండా కరోనాపై పోరాడ వచ్చన్నారు. కరోనాపై పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మాస్క్ వాడకం, సామాజిక దూరం పాటించడంపై, మహమ్మారి దీర్ఘాకాలిక వాస్తవికతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
యూనివర్శిల్ వ్యాక్సిన్ మాత్రమే దీనికి దీర్ఘకాలిక పరిష్కారమన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కేసులు తగ్గడం వల్ల లాక్ డౌన్ విధించాల్సిన పనిలేదన్నారు. కేవలం కోవిడ్ క్లస్టర్స్‌లో మాత్రమే మినీ లాక్ డౌన్ పెట్టాలన్నారు ఓవైసీ. ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎంఓకు ట్వీట్ ద్వారా సూచించారు.