కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీలు డిమాండ్
BRS MLCS: సీఎం క్షమాపణపై వెనక్కి తగ్గేది లేదన్న BRS ఎమ్మెల్సీలు
BRS MLCS: తెలంగాణ శాసనమండలిలోని మెంబర్స్ హాల్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచితి వ్యాఖ్యలు చేశారని.. ఇందుకు క్షమాపణ కోరాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం క్షమాపణపై వెనక్కి తగ్గేదిలేదంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో మంత్రి జూపల్లి చర్చలు జరిపారు. సాయంత్రం సభలో సీఎం వివరణ ఇస్తారని హామీ ఇచ్చారు. మంత్రులతో చర్చల సారాంశాన్ని ఎమ్మెల్సీలకు వివరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్.