టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు.. టిక్కెట్ నాకే.. టచ్‌లో ఎమ్మెల్యే వర్గం..

Patnam Mahender Reddy: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-02-25 14:53 GMT
MLC Patnam Mahender Reddy hot Comments on Tandur MLA Ticket

టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు.. టిక్కెట్ నాకే.. టచ్‌లో ఎమ్మెల్యే వర్గం..

  • whatsapp icon

Patnam Mahender Reddy: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటూ ప్రకటించారు. ప్రజలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీ తనకే టికెట్‌ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాండూరు మున్సిపల్‌ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఐదేళ్లు పదవిలో ఉంటారని నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మెజార్టీ మున్సిపల్‌ కౌన్సిలర్లు నాతోనే ఉన్నారని తెలిపారు పట్నం మహేందర్‌ రెడ్డి. ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నాతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు మహేందర్‌రెడ్డి. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా వెంట రావడానికి వారు సిద్ధంగా ఉన్నారంటూ పట్నం మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా పైలట్ రోహిత్ రెడ్డిని గులాబీ పార్టీ రెడ్‌కార్పెట్ పరిచి మరీ ఆహ్వానించింది. 

Tags:    

Similar News