MLC Kaitha: రెజ్లర్ల ఆందోళనపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్.. బాధితురాలికి న్యాయం చేయాలన్న కవిత
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్
MLC Kavitha: రెజ్లర్లుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. భారతదేశ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన మహిళా రెజ్లర్లపై దాడులు జరగడం అన్యాయమని ట్వీట్ చేశారు. ఐదు రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోక్సో వంటి తీవ్రమైన అభియోగం తర్వాత కూడా, నిందితుడు బహిరంగంగా తిరుగుతున్నాడని కవిత ఆరోపించారు. బాధితురాలికి మాత్రం న్యాయం జరగడంలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.