MLC Kavitha: కేసీఆర్ మరోసారి సీఎం అయితే దక్షిణాది రాష్ట్రాల్లో చరిత్ర సృష్టిస్తారు
MLC Kavitha: ఎవరు వరుసగా మూరుసార్లు సీఎం కాలేదు
MLC Kavitha: తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీఆర్ఎస్ ఆశీర్వాదసభలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగించారు. కేసీఆర్ మరోసారి సీఎం అయితే దక్షిణాది రాష్ట్రాల్లో చరిత్ర సృష్టిస్తారని ఆమె అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరు వరుసగా మూరుసార్లు సీఎం కాలేదన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో బోధన్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.