బతుకమ్మ పండుగ స్ఫూర్తితో కరోనాను ఎదుర్కోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఒకే చోట ఎక్కువ మంది గుమ్మిగూడ వద్దని సూచించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదని కవిత ట్వీట్ చేశారు.