MLC Kavitha: బాండ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారు
MLC Kavitha: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఐదేళ్లలో ఇచ్చింది 21 ఉద్యోగాలే
MLC Kavitha: బాండ్ల పేరుతో కాంగ్రెస్ నేతలు మోసం చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆర్నెళ్ల కిందట కర్ణాటకలో కూడా బాండ్ పేపర్లు రాసిచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేకపోవడంతోనే ఇక్కడ కూడా బాండ్ పేపర్లు పంచుతున్నారని చురకలు అంటించారు. రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లో నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ , బీజేపీ కలిసి ఐదేళ్లలో ఇచ్చింది కేవలం 21 ఉద్యోగాలేనన్నారు. తెలంగాణలో 10ఏళ్లలో 2లక్షల 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత.