MLC Kavitha: కారు గుర్తుతో ప్రజల జీవితాల్లో వెలుగులు... కాంగ్రెస్ తో కటిక చీకట్లు
MLC Kavitha: జగిత్యాల నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు మద్దతుగా మైతాపూర్‌లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. 55ఏళ్లు పరిపాలన చేసే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మరోసారి ఒక్క అవకాశం అంటూ కాంగ్రెస్ పార్టీ అడగడం విడ్డూరమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.