ఆపరేషన్ ఆకర్ష్‌ను స్పీడప్ చేసిన కాంగ్రెస్.. సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
Operation Akarsh: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ను అధికార కాంగ్రెస్ స్పీడప్ చేసింది.
Operation Akarsh: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌ను అధికార కాంగ్రెస్ స్పీడప్ చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చేరుతోన్న నేతలకు హస్తం కండువాలు కప్పుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రేపు మమబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ టూర్లోనే చల్లా వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగు నీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సీఎంను ఎమ్మెల్సీ కోరారు. ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్లొ చల్లా చేరే అవకాశం ఉంది. అయితే ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది గులాబీ పార్టీ.