ఎమ్మెల్యే రాములు నాయక్ కారు బీభత్సం
Ramulu Naik: ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కారు తగలి ఇద్దరు గాయాల పాలయ్యారు.
Ramulu Naik: ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కారు తగలి ఇద్దరు గాయాల పాలయ్యారు. ఎమ్మెల్యే రాములు నాయక్ ఖమ్మం నుంచి కారేపల్లికి కారులో వెళ్తుండగా రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద అతని కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న బైకును ఢీకొట్టింది. ఈఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను వెంటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుల బైకుతో పాటు ఎమ్మెల్యే కారు కూడా దెబ్బతినడంతో రాములు నాయక్ మరో కారులో అక్కడి నుంచి బయలు దేరినట్లు తెలుస్తుంది.