Sridhar Babu: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం

Sridhar Babu: ఆరు గ్యారంటీలను ఇంటింటికీ చేరవేస్తాం

Update: 2023-11-14 13:45 GMT

Sridhar Babu: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం

Sridhar Babu: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహాదేవపూర్ మండలంలోని అన్నారం, చండ్రుపల్లి, మద్దులపల్లి గ్రామాల్లో ప్రజలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టో వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పేదవారికి అండగా ఉంటామని శ్రీధర్ బాబు అన్నారు. తాము గెలిచిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్న ఆయన..పార్టీ ఆరు గ్యారెంటీలను ఇంటింటికి చేరవేస్తామని తెలిపారు.

Tags:    

Similar News