దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సందర్శించిన మంత్రి తలసాని
Talasani Srinivas Visits Cable Bridge : హైదరాబాద్ నగరంలో అద్భుతమైన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్ నగరంలో పూర్తయింది.
Talasani Srinivas Visits Cable Bridge : హైదరాబాద్ నగరంలో అద్భుతమైన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్ నగరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న నగరానికి ఈ కొత్త నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ కేబుల్ వంతెనను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పరిశీలించారు. అదే మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి. అయితే ఈ వంతెనను పరిశీలించిన శ్రీనివాస్ యాదవ్ వంతెన నిర్మాణంలో వాడిన సాంకేతిక పద్ధతులు, ఇంజినీరింగ్ నైపుణ్యం, డిజైన్ వంటి వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోని పెద్ద కేబుల్ వంతెనలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ బ్రిడ్జి రాకతో దుర్గం చెరువు ప్రాంతం పర్యటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఈ కేబుల్ వంతెన ప్రారంభించడం ద్వారా చాలా మంది ప్రయాణికులకు కొన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణ భారం తగ్గుతుంది. అంతే కాదు శని, ఆదివారాల్లో ఈ కేబుల్ వంతెన పైకి వాహనాలు అనుమతి చేయకుండా కేవలం సందర్శనకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు. ఈ కేబుల్ వంతెనను సందర్శనకు వచ్చిన వారి వాహనాలు పార్కింగ్ చేయడానికి కూడా స్థలాన్ని ఏర్పాటు చేసారు.
ఇక కొద్ది రోజుల క్రితమే అన్ని హంగులతో నిర్మించిన ఈ తీగలవంతెన ఎప్పుడు ప్రారంభిస్తున్నారనే ప్రశ్నలు నెటిజన్ల మనసులో కదులుతున్నాయి. దీంతో ఓ నెటిజన్ వంతెనపై రాకపోకలను ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ ఆగస్టు నెలాఖరు నాటికి ప్రారంభం ఉంటుందని తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా 'ఆస్క్ కేటీఆర్' కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ వంతెన ప్రారంభంపై కీలక ప్రకటన చేశారు.