మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నేడు విచారణ

*కోర్టును ఆశ్రయించిన నిందితులు రాఘవేంద్రరాజు, విశ్వనాథ్‌ ఫ్యామిలీ

Update: 2022-08-10 06:38 GMT

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నేడు విచారణ

Minister Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసుపై నేడు మహబూబ్‌నగర్‌ కోర్టు విచారణ చేపట్టనుంది. హత్యకు కుట్ర ఓ బూటకమంటూ రాఘవేంద్రరాజు, విశ్వనాథ్‌ ఫ్యామిలీ.. కోర్టును ఆశ్రయించారు. కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను కోర్టుకు సమర్పించారు. పిటిషన్‌ను కాగ్నిజెన్స్‌గా పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఇవాళ కోర్టుకు హాజరుకావాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సైబరాబాద్‌ సీపీతో పాటు ఇతర పోలీస్‌ అధికారులకు నోటీసులు జారీ చేసింది. రాఘవేంద్రరాజు, విశ్వనాథ్‌ భార్య గత నెలలో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

శ్రీనివాస్‌గౌడ్‌పై ఈసీకి ఫిర్యాదు చేశామని తప్పుడు కేసులు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినందుకు తన భర్తను కిడ్నాప్‌ చేశారంటూ విశ్వనాథ్‌ భార్య పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇంట్లోకి చొరబడి సీసీటీవీ ఫుటేజ్, పెన్‌డ్రైవ్‌, హార్డిస్క్‌లను ధ్వంసం చేశారని రాఘవేంద్రరాజు తన పిటిషన్‌లో కోర్టుకు తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో ఫిబ్రవరి నెలలో రాఘవేంద్రరాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఈ ఇద్దరూ.. మహబూబ్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags:    

Similar News