బాస‌ర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువదలని భట్టీవిక్రమార్కుల్లా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.

Update: 2022-06-20 12:48 GMT

బాస‌ర ట్రిపుల్ ఐటీకి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువదలని భట్టీవిక్రమార్కుల్లా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఎండనక, వాననక తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఒకరోజుకాదు రెండు రోజులు కాదు ఏడురోజులుగా ఆందోళన కార్యక్రమాలతో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శకు వచ్చినపుడు తమగోడును వెల్లబోసుకున్నారు. న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను కల్పించాలని వేడుకున్నారు. చర్చలు, ఉత్తుత్తి హామీలు వద్దని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి మౌలిక వసతుల్లేకుండా క్లాసులు ఎలా వినాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

శాశ్వత ప్రాతిపదికన వైస్‌ఛాన్సలర్‌ను నియమించాలని విద్యార్థుల డిమాండు నేపథ్యంలో డైరెక్టర్‌ను నియమించారు. ఒక దశలో విద్యార్థుల ఆందోళన చేపట్టేంతటి సమస్యల్లేవని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలు విద్యార్థుల పట్టుదలను రెట్టింపుచేశాయి. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి స్వయంగా విద్యార్థులతో భేటీ కాబోతున్నారు. ఉన్నత విద్యాశాఖాధికారులతో కలిసి మంత్రి సబిత విద్యార్థులతో చర్చించి, తన వ్యాఖ్యల ఆంతర్యాన్ని విద్యార్థులకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు.

Tags:    

Similar News