తెలంగాణ మహిళ విశ్వవిద్యాలయంపై మంత్రి సబిత సమీక్ష
Sabita Indra Reddy: ఉన్నతవిద్యలో మహిళలు ముందంజలో ఉండాలి
Sabita Indra Reddy: తెలంగాణ రాష్ట్రం ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటుకు ప్రోత్సహించిన సీఎం కేసీఆర్ కు సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంపై ఉన్నత విద్యా శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
త్వరలోనే వందేళ్ళు పూర్తి చేసుకోబోతున్న కోఠి ఉమెన్స్ కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మార్పు చేసిన ఉత్తర్వులను ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ అందజేశారు. తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మంత్రి సబిత గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.