Puvvada Ajay Kumar: పోలవరం ఎత్తు పెంచడంతో భద్రాచలం నీట మునిగింది

*పోలవరం వల్ల భద్రాచలం వద్ద 45 అడుగుల నీరు ఉంటుంది- మంత్రి పువ్వాడ

Update: 2022-07-19 07:10 GMT

Puvvada Ajay Kumar: పోలవరం ఎత్తు పెంచడంతో భద్రాచలం నీట మునిగింది

Puvvada Ajay Kumar: భద్రాద్రిలో గోదావరి వరదపై మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాద్రిలో 45 అడుగల వద్ద నీటి మట్టం ఎప్పటికీ నిలిచి ఉండనుందన్నారు. భద్రాద్రి పట్టణానికి వరదల నుంచి శాశ్వత పరిష్కారం చూపేందుకు కార్యాచరణ అమలు చేస్తామన్నారు మంత్రి పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి కరకట్టను బలోపేతం చేస్తామన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. వరద పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెయ్యి కోట్లు ప్రకటించారని అందుకు ధన్యవాదాలని తెలిపారు పువ్వాడ అజయ్ 1986 తర్వాత భారీ ఫ్లడ్ వచ్చిందని వరద 72 అడుగులకు చేరిందని 25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం పట్టణాన్ని ముంచేసిందన్నారు. పోలవరం ఎత్తు తగ్గించాలని అనేకసార్లు ఆంధ్రప్రదేశ్ ను డిమాండ్ చేశామన్న అజయ్ ముప్పు ముప్పును గమనించే కరకట్టల బలోపేతానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

రామాలయం దగ్గర నీళ్లు నిలబడకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి గోదావరికి 100 అడుగుల వరద వచ్చినా తట్టుకునేలా కరకట్టలను బలోపేతం చేస్తామన్నారు. గోదావరి పరిధిలో ఇంకా 500 మీటర్లు కరకట్ట పూర్తి చేయాల్సి ఉందన్నారు మంత్రి అజయ్. ఆంధ్రప్రదేశ్ లోని ఎటపాక దగ్గర కరకట్ట పూర్తిగా తగ్గించారని దాన్ని సరిచేయాలని అభిప్రాయపడ్డారు. ముంపు బాధితుల కోసం 2 నుంచి 3 వేల ఇళ్ల నిర్మామం చేపట్టాల్సి వస్తుంన్నదారు.

భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. వెంటనే పార్లమెంట్ లో అందుకు సంబంధించిన బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు పువ్వాడ అజయ్. పోలవరం ఎత్తుపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.భద్రాద్రిలో వరద సహాయక చర్యలను మంత్రి వివరించారు. 240 గ్రామాల్లో పవర్ ఎఫెక్ట్ అయితే మొత్తం రీస్టోర్ చేశామని వివరించారు. గోదావరికి వరద తగ్గుముఖం పడుతున్నా అధికారులంతా నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని మంత్రి అజయ్ వెల్లడించారు.

Full View


Tags:    

Similar News