Ponnam Prabhakar: విపక్షాల విమర్శలకు మంత్రి పొన్నం కౌంటర్

Ponnam Prabhakar: ప్రభుత్వ సుస్థిరత కోసమే ఎమ్మెల్యేల చేరికలు

Update: 2024-07-15 15:45 GMT

Ponnam Prabhakar: విపక్షాల విమర్శలకు మంత్రి పొన్నం కౌంటర్

Ponnam Prabhakar: కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల చేరికపై రాజకీయ రగడ రేగుతున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చుతామని రెచ్చగొడుతుంటే తాము చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. డిసెంబర్ 3 వరకు తమకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదని.. ఆనాడే తాము తలుచుకుంటే ‎ఇప్పటివరకు బీఆర్ఎస్ ఖాళీ అయ్యేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెచ్చగొట్టడంతోనే ప్రభుత్వ సుస్థిరత కోసం ఎమ్మెల్యేల చేరికను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News