minister Malla reddy tests positive for coronavirus: కరోనా వైరస్ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా ఈ జాబితాలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. గత ఆదివారం మల్లారెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు మంత్రి మల్లారెడ్డి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
ఇక, మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి కరోనా పరీక్షలు చేస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతుల సంఖ్య 615కి పెరిగింది. కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330కి చేరింది. ప్రస్తుతం 21417 మంది చికిత్స పొందుతున్నారు.