KTR: తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాలి
KTR: కర్ణాటకలో మతం పేరిటి విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టారు
KTR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి గుండెల నిండా ప్రేమను పంచాల్సింది పోయి గుండెల్లో గుణపాలు దించే విధంగా అడ్డంగా మాట్లాడారని మండిపడ్డారు. 50ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని అవమానించిన మోడీ రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మతం పేరిట విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టారని కర్ణాటక హిజాబ్ ఘటనను ప్రస్తావించారు కేటీఆర్. ఒక పక్క బేఠీ బచావ్.. బేఠీ పడావ్ అంటూనే.. మరోవైపు బేఠీ డరావ్.. బేఠీ ధంకావ్ పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు కేటీఆర్.