KTR: ఇవాళ నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
KTR: రూ.912.33 కోట్ల వ్యయంతో అభివృద్ది పనులకు శ్రీకారం
KTR: మంత్రి కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. 912 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. నల్గొండలో ఐటీ హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రోడ్లు, జంక్షన్లు, పార్కులను కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి తెలిపారు. కళాభారతి, ఉదయం సముద్రం ట్యాంక్‌బండ్, శిల్పారామం, ఎన్‌జీ కళాశాల భవనం, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, మున్సిపల్ కమర్షియల్ కాంప్లెక్స్, తాగునీటి పైపులైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎన్‌జీ కళాశాలలో నిర్వహించే ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ సభను ప్రజలు, బీఆర్‌ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కోరారు.