Minister KTR: స్క్రిప్ట్ చదవడం కాదు.. వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మాట్లాడాలి
Minister KTR: రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ సెటైర్లు
Minister KTR: కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన, వరంగల్ డిక్లరేషన్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఏ హోదాలో తెలంగాణ రైతులకు డిక్లరేషన్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీకు ఎవరితో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్న మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీ ఓ అజ్ఞానిలా మాట్లాడారని సెటైర్ వేశారు. దేశంలోనే ఆపార్టీకి దిక్కే లేదన్నారు. స్క్రిప్ట్ చదవడమే కాదు.
ఇక్కడి పరిస్థితులు తెలుసుకుని మాట్లాడితే ఆయన కు కొంతైనా గౌరవం దక్కేదన్నారు. ఆయన చెప్పినట్లు కేసీఆర్ ఓ రాజు , నియంతే అయితే టీపీసీసీ చీఫ్, ఆపార్టీ ఇతర నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే వారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే స్కాముల పార్టీ అన్నవిషయం మరిచిపోయి తాము అవినీతి చేస్తున్నామనడం సిగ్గుచేటన్నారు. వరంగల్ డిక్లరేషన్ పాత చింతకాయ పచ్చడితో పోలుస్తూ సెటైర్ వేశారు మంత్రి కేటీఆర్.