హైదరాబాద్‌ చరిత్రలో రెండో అతిపెద్ద వర్షం : మంత్రి కేటీఆర్‌

Hyderabad Rains: హైదరాబాద్‌ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వర్షమన్నారు మంత్రి కేటీఆర్. మూసీకి 1908లో వరదలు వచ్చాయని.. ఆనాడు ఒకే రోజు 43 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు. హైదరాబాద్‌లో సగటున ఏటా 78సెం.మీ వర్షం పడుతుందన్న ఆయన..

Update: 2020-10-19 10:20 GMT

KTR Respond On Rains : హైదరాబాదు వాసులను వరుణుడు వదలడం లేదు. కాస్త గ్యాప్‌ ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ దంచికొడుతోంది. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నారు. జాగా నగరంలోని పలుచోట్ల వర్షం మళ్లీ మొదలైంది. మల్కాజ్‌గిరి, నాచారం, ముషీరాబాద్‌, కాప్రా, తార్నాక, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట్‌, చార్మినార్‌, సుల్తాన్‌ బజార్‌, కోఠి, ఖైరతాబాద్‌, గచ్చిబౌలి, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వర్షం కురుస్తుండడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాలనీ వాసులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

హైదరాబాద్‌ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వర్షమన్నారు మంత్రి కేటీఆర్. మూసీకి 1908లో వరదలు వచ్చాయని.. ఆనాడు ఒకే రోజు 43 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు. హైదరాబాద్‌లో సగటున ఏటా 78సెం.మీ వర్షం పడుతుందన్న ఆయన.. ఈ ఏడాది ఇప్పటికే 80శాతం అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఇక అటు రాబోయే మూడు రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశముందన్నారు మంత్రి కేటీఆర్. ఇందుకు గాను.. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందే పునరావాస కేంద్రాలకు తరలిరావలని సూచించారు. వరద బాధితుల కోసం ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసిందన్న ఆయన.. ప్రాణనష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తమకుందన్నారు.

Tags:    

Similar News