KTR: కవితకు మద్దతుగా ఢిల్లీకి చేరుకున్న మంత్రి కేటీఆర్

KTR: రెండు రోజుల పాటు అక్కడే మకాం, లాయర్లతో విస్తృత చర్చలు

Update: 2023-03-11 03:15 GMT

KTR: కవితకు మద్దతుగా ఢిల్లీకి చేరుకున్న మంత్రి కేటీఆర్

KTR: మంత్రి కేటీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో లీగల్ టీమ్‌తో చర్చించేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు కేటీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. నిన్న బీఆర్ఎస్ సమావేశం ముగిసిన తర్వాత కేటీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తన సోదరి కవితకు అండగా ఉండేందుకు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News