హైదరాబాద్ మహానగర సిగలో మరో మణిహారం.. నేడు ప్రారంభం కానున్న షేక్‌పేట్ ఫ్లై ఓవర్
Shaikpet Flyover - KTR: *రూ.333.55 కోట్ల వ్యయంతో నిర్మాణం *2.71 కి.మీ మేర షేక్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణం
Shaikpet Flyover - KTR: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు మరింత తీరనున్నాయి. అద్భుతమైన షేక్‌పేట్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. 333.55 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టోలిచౌకీ రిలయన్స్ మార్ట్ నుంచి షేక్‌పేట్, రాయదుర్గం మల్కం వరకు 2.71 కిలోమీటర్ల మేరకు నిర్మాణం చేపట్టారు. దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున్న ఇది నగరంలో పొడవైన ఫ్లై ఓవర్లలో ఒకటిగా నిలవనుంది.
దీంతో మెహదీపట్నం - హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నేడు, పాత కొత్త నగరాలను కలిపే ఫ్లై ఓవర్‌ను ప్రారంభించుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. పై వంతెన ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.