Hyderabad: రంగారెడ్డి ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం

Hyderabad: ఒక్కో జిల్లాకు ఇన్‌చార్జ్‌లుగా ముగ్గురు మంత్రుల నియామకం

Update: 2021-02-25 02:53 GMT
ఫైల్ ఇమేజ్ 

Telangana: తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌-రంగారెడ్డి ప్రజా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం ముగిసింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పక్కా వ్యూహంతో ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు మంత్రి కేటీఆర్‌. ఒక్కో జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించారు. అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఇక నియోజకవర్గానికి ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యత అని అన్నారు మంత్రి. ఓటు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరినీ టచ్‌ చేయాలని సూచించారు కేటీఆర్.

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా లక్షా 32వేల 899 ఉద్యోగాలు కల్పించామని తెలిపారు మంత్రి కేటీఆర్. టీఎస్‌ ఐపాస్ ద్వారా 14వేల పైచిలుకు పరిశ్రమలు స్థాపించి.. 14 లక్షల ఉద్యోగాలు తెచ్చామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టండని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. 

Tags:    

Similar News