KTR: వర్షాలు పడితే మూసీ నదికి వరదలు వచ్చి.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం
KTR: *ప్రతి వర్షపు చుక్క మూసీలోకి వెళ్లేలా నాలాల అభివృద్ధి *దీని కోసం రూ.900 కోట్లకు పైగా కేటాయించాం
KTR: వర్షాలు పడితే మూసీ నదికి వరదలు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకోసమే ప్రతి వర్షపు చుక్క మూసీలోకి వెళ్లేలా నాలాల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. దీనికోసం 900 కోట్లకు పైగా కేటాయించామన్నారు. అలాగే 3వేల 866 కోట్లతో STPలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మల్లాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఉప్పల్ కూడలిలో 35 కోట్లతో ఏర్పాటైన స్కై వాక్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నరు.