KTR: భారత ప్రభుత్వంపై టెస్లా అధినేత ఆరోపణలు.. కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌..

KTR: భారత్‌లోకి టెస్లా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు విషయంలో ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Update: 2022-01-15 10:37 GMT

KTR: భారత ప్రభుత్వంపై టెస్లా అధినేత ఆరోపణలు.. కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌..

KTR: భారత్‌లోకి టెస్లా కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు విషయంలో ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వంతో ఎదురవుతున్న సవాళ్ల కారణంగానే భారత్‌కు టెస్లా రాక ఆలస్యమవుతోందని మస్క్‌ ట్విటర్‌లో ఆరోపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ టెస్లా అధినేత వ్యాఖ్యలపై స్పందించారు.

భారత్‌లో టెస్లా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభిస్తున్నందుకు ముందుగా మస్క్‌కు ధన్యవాదాలు చెప్పిన కేటీఆర్. తెలంగాణ, ఇండియాలో పరిశ్రమల అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందని చెప్పారు. దేశంలో తమ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Tags:    

Similar News