ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదు : మంత్రి కేటీఆర్
ఇక GHMC ఎన్నికల్లో మజ్లిస్ తో తమకి పొత్తు లేదని ఒంటరిగానే బరిలోకిదిగుతున్నట్టుగా వెల్లడించారు కేటీఆర్. పాతబస్తీలో గతంలో అయిదు సీట్లు గెలిచామని, ఈ సారి పది స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బల్దియాలో బలం నిరూపించుకునేందుకు టీఆర్ఎస్ ఆచూతూచి అడుగులు వేస్తోందని అన్నారు మంత్రి కేటీఆర్.. ఆరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చాక జరిగిన అభివృద్ధిని పూసగుంచినట్లు వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కనీస అవసరాలకు ముప్పతిప్పలు పడేదని మంత్రి అన్నారు. ఇక కేసీఆర్ పాలన మొదలయ్యాక కనీక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టారని మంత్రి అన్నారు. కరంట్, నీళ్ల సరఫరాలో ప్రతిపక్షాలు కూడా విమర్శంచలేని స్థాయికి ప్రభుత్వం చేరుకుందని మంత్రి అన్నారు.
సీఎం కేసీఆర్ పాలన వచ్చాక హైదారాబాద్ వాసులు దర్జాగా జీవిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సామాన్యులకు ఎలాంటి పన్నుభారాలు, అదనపు వసూళ్లు లేకుండా మెరుగైన పాలన అందించామని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ సామాన్యుల ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒక్కొక్కటి పూర్తి చూశారని అన్నారు.
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అలజడి సృష్టిస్తే.. ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు.
ఇక GHMC ఎన్నికల్లో మజ్లిస్ తో తమకి పొత్తు లేదని ఒంటరిగానే బరిలోకిదిగుతున్నట్టుగా వెల్లడించారు కేటీఆర్. పాతబస్తీలో గతంలో అయిదు సీట్లు గెలిచామని, ఈ సారి పది స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక 150 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు పోటి చేస్తారని, తమ పార్టీ మహిళ నేతే మేయర్ అవుతారని అన్నారు. బల్దియా పైన గులాబీ జెండా ఎగురుతుందని అన్నారు. MIMకి మేయర్ పీఠం ఇస్తామనేది పిచ్చి ప్రచారం అన్నారు.