KTR: తెలంగాణలో విజయం బీఆర్ఎస్‌దే.. తేల్చి చెప్పిన కేటీఆర్

KTR: ఎగ్జిట్ పోల్స్ చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు కంగారు పడొద్దు

Update: 2023-12-01 03:43 GMT

KTR: తెలంగాణలో విజయం బీఆర్ఎస్‌దే.. తేల్చి చెప్పిన కేటీఆర్

KTR: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తిరిగి డిసెంబర్ 3న సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. మళ్లీ అధికారం తమదేనని, హ్యాట్రిక్ కొడతామని, 70కి పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారాయన.. డిసెంబర్ 3న మళ్లీ అధికారం చేపడతామని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కంగారు పడాల్సిన అవసరం లేదని, అదంతా తప్పుల తడక అన్నారు కేటీఆర్. 2018లో వచ్చిన చాలా ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలాయని, అప్పుడు ఒక్క ఎజెన్సీ మాత్రమే నిజం చెప్పిందన్నారు.. చాలా మంది ఓటింగ్ కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు వేచి ఉండగా... ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించడమేంటని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News