KTR: ఆర్నెళ్లకు ఒకసారి సీఎం మారిపోతే అభివృద్ధి ఆగిపోతుంది

KTR: కాంగ్రెస్‌ గెలిస్తే కుర్చీ కొట్లాటకే సమయం సరిపోతుంది

Update: 2023-11-21 02:04 GMT

KTR: ఆర్నెళ్లకు ఒకసారి సీఎం మారిపోతే అభివృద్ధి ఆగిపోతుంది

KTR: ఆర్నెళ్లకు ఒకసారి ముఖ్యమంత్రి మారిపోతే.. అభివృద్ధి ఆగిపోతుందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌ కల్చర్‌ ఏంటో ప్రజలకు తెలుసని, మొత్తం ఆ పార్టీలో 11 మంది సీఎం అభ్యర్థులున్నారంటూ చురకలు అంటించారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే హైదరాబాద్‌లో నలుగురు సీఎం అభ్యర్థులు ఉండగా.. నల్గొండలో మరో ఇద్దరు, ముగ్గురున్నారని, మరో జిల్లాలో ఇంకో నలుగురు ఉన్నారని, ఒకవేళ కాంగ్రెస్‌ గెలిస్తే.. కుర్చీ కొట్లాటకే టైమ్‌ సరిపోతుందన్నారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్‌రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

Tags:    

Similar News