KTR: ఇది చేతల ప్రభుత్వం.... చేనేతల ప్రభుత్వం
KTR: అన్ని రంగాలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్-
KTR: అన్ని వర్గాలను,అన్ని రంగాలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు మంత్రి కేటీఆర్. కొత్త సీసాలో పాత సారానే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. దృఢమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం ఉండాలి కానీ 6నెలలకు ఒక్క ముఖ్యమంత్రి అయ్యే ప్రభుత్వం మనకు ఎందుకు అని ప్రశ్నించారు. ఢిల్లీలో నుండి సీల్డ్ కవర్ లో వచ్చే ముఖ్యమంత్రులు మనకు ఎందుకని.. చేనేత రుణమాఫీ చేసుకుందామని తెలిపారు.
ఇది చేతల ప్రభుత్వం.... చేనేత ల ప్రభుత్వం అని తెలిపారు.అవతల 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇక్కడ ఒక్క కేసీఆర్ ఉన్నాడన్నారు. ఒక్క నల్గొండ జిల్లాలో 4 ముఖ్యమంత్రులు ఉన్నారని కాంగ్రెస్‌ని విమర్శించారు. తొమ్మిదిన్నర సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేశాడు అనేది ఆలోచన చేయాలని కోరారు.