KTR: ధరణి ముద్దు.. పట్వారీ వ్యవస్థ వద్దు.. ఆలోచించి ఓటేయండి
KTR: అన్ని మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుతగులుతోంది
KTR: బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న కరెంటు రేవంత్ రెడ్డికి, షబ్బీర్ అలీకి కనిపించడం లేదని, కరెంటు తీగలు పట్టుకుంటే తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడైనా మూడు గంటల కరెంట్ ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతోందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాగానే 4 వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందజేస్తారన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందజేస్తామని చెప్పారాయన. సౌభాగ్యలక్షి పథకం కింద 18 సంవత్సరాల నిండిన మహిళలకు 3 వేల రూపాయలు అందజేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 5 లక్షలు బీమా అందజేస్తామని పేర్కొన్నారు. రైతుబంధు 10 వేల నుంచి 16 వేలకు పెంచుతామని చెప్పారు. 24 గంటల కరెంటు కావాలంటే కేసీఆర్‌కు ఓటేయాలని కోరారు.