జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేసిన కేటీఆర్‌

Update: 2020-10-13 13:41 GMT

హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికల నేపథ‌్యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే, పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయడంతోపాటు ప్రాణ నష్టాన్ని నివారించేందుకు వాళ్లను ఖాళీ చేయించాలని సూచించారు. ఎడితెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున జీహెచ్ఎంసీ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News