తెలంగాణలో లైన్ ఉమెన్ ఉద్యోగం పొందిన యువతి శిరీష

Line Woman Babburi Sirisha: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో తొలి లైన్ ఉమెన్‌గా బబ్బూరి శిరీష అపాయింట్ మెంట్ తీసుకుంది.

Update: 2022-05-11 16:00 GMT

తెలంగాణలో లైన్ ఉమెన్ ఉద్యోగం పొందిన యువతి శిరీష

Line Woman Babburi Sirisha: తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో తొలి లైన్ ఉమెన్‌గా బబ్బూరి శిరీష అపాయింట్ మెంట్ తీసుకుంది. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న శిరీషను మేడ్చల్ లో MRT సెక్షన్ లో లైన్ ఉమెన్ గా ఎంపికచేస్తూ టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘురామరెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అపాయింట్ మెంట్ ఆర్డర్ అందించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళలకు విద్యుత్తుశాఖలో లైన్ ఉమెన్లుగా కొత్తగా అవకాశం కల్పించామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఇదివరకు ట్రన్స్‌కోలో లైన్ ఉమెన్లుగా మహిళలకు అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా SPDCLలోనూ మహిళలను ఎంపిక చేయసంకల్పించామన్నారు. SPDCLలో తొలి లైన్ ఉమెన్‌గా శిరీష ఎంపికైందని తెలిపారు.

అప్లికేషన్ చేయడం నుంచి అపాయింట్ మెంట్ పొందడం దాకా సహకరించిన కుటుంబ సభ్యులకు, విద్యుత్తుశాఖ అధికారులకు లైన్ ఉమెన్ శిరీష కృతజ్ఞతలు తెలిపారు. తనలాగా చాలామంది యువతులు ముందుకొచ్చి ఉద్యోగవకాశాలను అందిపుచ్చుకుంటారనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News