Minister Itala Rajender : ఆరోగ్యశ్రీలో మార్పులు తెస్తున్నాం: మంత్రి ఈటల రాజేందర్

Update: 2020-10-05 13:35 GMT

Minister Itala Rajender : తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ ఆరోగ్యశ్రీ పథకంలో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే ఈ లోపాలన్నింటినీ సరిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ పథకంలో కొన్ని మార్పుల చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ పథకంలో ఉన్న లోపాలను సరిదిద్ది, ఆరోగ్యశ్రీలో రోగులను తిరస్కరించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన సోమవారం పేర్కొన్నారు.

ఇక పోతే ఇప్పటి వరకు కేవలం కరోనా కేంద్రంగా ఉన్న కొన్ని ఆస్పత్రుల్లో సాధారణ సేవలు మొదలయ్యాయని, ఒక గాంధీ ఆస్పత్రిలో మాత్రం సాధారణ సేవలు ఇంకా మొదలు కాలేదని ఆయన అన్నారు. కరోనా డ్యూటీల్లో లేని వైద్యులు, ఇతర సిబ్బంది విధులకు వెంటనే హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. క్వారంటైన్‌ సెలవులు కేవలం కోవిడ్‌ డ్యూటీల్లో ఉన్నవాళ్లకు మాత్రమే వర్తిస్తాయని ఈటల తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటే కరోనాను తరిమివేయవచ్చిని మంత్రి ఈటల పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతగానో విస్తరించిన కరోనా వైరస్‌ ఉధృతి ప్రస్తుతం తగ్గిందని అయితే రానున్న బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఎవరి ఇంట్లో వాళ్లే నిర్వహించుకోవాలని లేకుంటే కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. ప్రజలంతా బయటికి వెళ్లినపుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు.

Tags:    

Similar News