Harish Rao: సిద్దిపేట జిల్లా చెర్ల అంకిరెడ్డి పల్లిలో మంత్రి హరీష్‌రావు పర్యటన
Harish Rao: పది రోజుల్లో రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీరు
Harish Rao: కాంగ్రెస్ హయాంలో.... వ్యవసాయం చేయాలంటే రైతుల కళ్లలో నీళ్లు వచ్చేవని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రతి రైతు పొలానికి సాగునీరు వచ్చిందని తెలిపారు. పది రోజుల్లో రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి చెరువులు నింపి, సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా చెర్ల అంకిరెడ్డి పల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి సీసీ రోడ్ల నిర్మాణానికి అవసమైన నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.