పాలన పక్కకు.. ప్రతిపక్షాలే టార్గెట్: బీజేపీపై హరీష్‌రావు ఫైర్
Harish Rao: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు.
Harish Rao: కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు మంత్రి హరీష్‌రావు. తెలంగాణ భూముల్లో కృష్ణ, గోదావరి జలాలు పారాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తుంటే రక్తం పారాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై పడటమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
దేశంలో పరిస్థితులను చూస్తుంటే దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయా..? అనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు హరీష్‌రావు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీతోపాటు నిన్న జార్ఖండ్‌లో బీజేపీ చేసిన నిర్వాకాన్ని అందరూ చూశారన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణిలో బీజేపీ పనిచేస్తున్నదని దుయ్యబట్టారు. ఆ పార్టీని ఎవరు ప్రశ్నించినా వారిని టార్గెట్ చేస్తోందని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు.