Harish Rao: తెలంగాణకు పురిటిదశనుంచే కేంద్రప్రభుత్వ అన్యాయం చేస్తోంది

Harish Rao: కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది

Update: 2022-03-07 07:22 GMT

Harish Rao: తెలంగాణకు పురిటిదశనుంచే కేంద్రప్రభుత్వ అన్యాయం చేస్తోంది

Harish Rao: తెలంగాణకు పురిటి దశనుంచే కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైందన్నారు. తెలంగాణలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడంనుంచి ఆర్థికసాయం అందించడంలో వివక్షత చూపిందన్నారు. తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కేంద్రప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేసిందనే విషయాలను సభలో ప్రస్తావించారు.

2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్రంపై ప్రభుత్వం విరుచుకుపడింది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రంపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపిందని మండిపడ్డారు. అక్రమ బదలాయింపుతో తెలంగాణ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును కోల్పోయిందన్నారు. హైకోర్టు విభజన చేయకుండా ఐదేళ్లు జాప్యం చేసిందని అన్నారు. విభజన హామీలు అమలు చేయడం లేదని మంత్రి తెలిపారు. బిడ్డను బతికించారు అంటూ కేంద్ర పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్‌పై అన్యాయం చేసిందని, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని అన్నారు.

నీతి అయోగ్ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపు ఇవ్వడం లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి అతీగతీ లేదని అన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన 495 కోట్ల రూపాయలను ఏపీ ఖాతాలో జమ చేసిందని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుకు విద్యుత్ సంస్కరణకు లంక పెట్టిందన్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో 25 వేల కోట్లు తెలంగాణ నష్టపోయిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. 

Tags:    

Similar News