Harish Rao: బీఆర్ఎస్ ఒక సెక్యూలర్ పార్టీ.. కేసీఆర్ ఒక సెక్యూలర్ లీడర్
Harish Rao: బీఆర్ఎస్-బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కాదు
Harish Rao: మైనారిటీ ఓట్ల కోసం బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పూడు ఒక్కటీ కాదని.. బీఆర్ఎస్ ఒక సెక్యూలర్ పార్టీ అని.. కేసీఆర్ సెక్యూలర్ లీడర్ అని అన్నారు. కాంగ్రెస్ ఆరోపిస్తున్నది నిజమైతే.. బీఆర్ఎస్‌కు గవర్నర్ సపోర్ట్ చేయాలి కదా అని ప్రశ్నించారు. కానీ బిల్లులను గవర్నర్ ఎందుకు తొక్కిపెడుతున్నారని.. ఆర్టీసీ బిల్లు లేట్ కావడానికి కారణం గవర్నరే అన్నారు. ఎమ్మెల్సీల తిరస్కరణ అంశాన్ని హరీష్ రావు ప్రస్తావించారు.