Telangana: రాష్ట్రంలో పండే ప్రతి గింజను కొంటాం -మంత్రి గంగుల
Telangana: తెలంగాణలో పండే ప్రతి గింజను కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు మంత్రి గంగుల కమలాకర్.
Telangana: తెలంగాణలో పండే ప్రతి గింజను కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన కరోనాతో భారత్ ఎక్కువగా నష్టపోయిందని అన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా పంటను గిట్టుబాటు ధరకు కొనాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి చెప్పారు.
ఇందుకోసం దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి గంగుల. ఎంఎస్‌పీ రాష్ట్రంలో ఎక్కువగా ఉందని పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. గన్ని బ్యాగుల కొరతపై మరో 2, 3 రోజుల్లో చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు టోకెన్ పద్ధతిలో ఉంటుందని వివరించారు.